ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి జయంత్ సిన్హా చేసిన ప్రకటన తమకు బాధ కలిగించిందని ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కేంద్రమంత్రి ప్రకటన... ఆనాడు సభలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి విలువ లేకుండా చేసిందన్నారు.
14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటన చేసిన కేంద్రమంత్రి... ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఎవరి సిఫార్సుతో ప్రత్యేక హోదా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీఏ, ఎన్టీయే నేతల మాటలతో మోసపోయామన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
0 comments :
Post a Comment