కృష్ణా బోర్డు ముందు తెలంగాణా.. ఆంధ్రప్రదేశ్ నీటి కోసం వాదనలు..




రాష్ట్ర విభజన తరువాత జల వివాదాలు తలెత్తుతాయి.. కనుక ముందు వాటిని పరిష్కరించి  తరువాత విభజనపై నిర్ణయం తీసుకోమని ఎందరో పెద్దలు నెత్తీ నోరూ బాదుకున్నారు. అయినా కాంగ్రెస్ అవేమీ పట్టించుకోలేదు.

ఇప్పుడు జల వివాదాల మధ్యలో రాష్ట్రాలు చిక్కుకుని అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నాయి.

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ పనే చేస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు.. "సీమ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మీరు కృష్ణాపై ప్రాజెక్టులు కడితే.." అంటున్నారు ఏ.పీ ముఖ్యమంత్రి. "కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి గెట్ల అయిన సరే మా తెలంగాణా రైతన్నల కన్నీళ్ళు తుడవాలే.." అంటున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి.




ఇద్దరి ఆలోచనా మంచిదే.. ప్రతీ చుక్కా.. ప్రతీ ఎకరా.. ప్రతీ రైతు కుటుంబం.. ప్రతీ ప్రాణం.. ఇవన్నీ ఏ రాష్ట్రానికైనా ఒక్కటే.. కనుక "పంచుకుందాం నీళ్ళు.. చెరిపేసుకుందాం మన రైతన్నల కళ్ళలోని కన్నీళ్ళు.."

ఏ ఒక్క రాష్ట్రానికీ అన్యాయం జరగకూడదూ.. నీళ్ళు ఉన్నపుడు ఏ ఒక్క ఎకరా ఎండకూడదు.. నీళ్ళు లేకపోయినా ఏ ఒక్క రైతూ నోరెళ్ళబెట్టి ప్రభుత్వం పైపు ఆశగా ఎదురు చూడకూడదు..
ఏ ఒక్క రైతన్న కళ్ళ నుంచి కన్నీటి బొట్టు రాలకూడదు..

ఇదే సంకల్పముతో.. ఇదే ఆలోచనతో ముందుకు కదలమని తెలుగు రాష్ట్రాల నీటి పారుదలశాఖ అధికారులకు http://politicalwing.blogspot.in/ తరపున ఒక చిన్న విన్నపం..




రేపు బోర్డు ముందు జరుగునున్న వాదనలు రెండు రాష్ట్ర రైతన్నలకు ఉపయుక్తమైనిగా ఉండాలనీ.. ఏ.పీ న్యాయవాది గంగూలీ.. టీ.జీ న్యాయవాది వైద్యనాధన్ న్యాయమైన వాదనలు వినిపించి రెండు రాష్ట్రాల రైతన్నలకు మంచి జరగాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ..


మీ రాము..




Share on Google Plus

About Rama Subhrahmanyam

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment